
అయితే రష్యా మనకు 60 డాలర్ల లోపే బేరల్ అమ్ముతుందన్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి దాని నిబంధనలకు భారతదేశం విరుద్ధం కాదు. అలాగే యూరప్ దేశాలు కూడా బ్యారెల్ అదే రేట్ కి కొంటున్నాయి కాబట్టి దానిని ఆబ్జెక్ట్ చేయవలసిన అవసరం లేదు. అయితే ఇలా కొన్న ఆయిల్ ని భారతదేశం రీసైకిల్ చేయకూడదని అవి అంటున్నట్లుగా తెలుస్తుంది.
ఇప్పటివరకు భారత్ ఆయిల్ ని కొని శుద్ధిచేసి ఇతర దేశాలకి, అంటే యూరప్ దేశాలకి అమ్ముతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఆ ఆయిల్ ని రీసేల్ చేయడం, ప్రాఫిట్ గా చూడడం నిబంధనలకు విరుద్ధమని యూరోపియన్ దేశాలు అంటున్నాయి. అయితే ఈ సందర్భంలో అవి ఆ సేల్ ని ఆపేయమని చెప్పి భారతదేశంపై ఒత్తిడిని ప్రారంభించాయట. అయితే భారతదేశ కేంద్రమంత్రి జయశంకర్ దీనికి సమాధానం ఇచ్చారు. టర్కీ వాళ్ళు శుద్ధి చేసి అమ్మితే కొనుక్కుంటున్నారు, చైనా వాళ్లు శుద్ధి చేసి అమ్మితే కొనుక్కుంటున్నారు. మీరే ఆ నిబంధనలను చూసుకోండి అన్నారట ఆయన.
మరి కొనుక్కోడానికి మీకు లేని నిబంధనలు, అమ్మడానికి ఆ దేశానికి లేని నిబంధనలు ఒక్క భారతదేశానికి ఎలా వర్తిస్తాయి అని ఆయన ప్రశ్నించారట. చైనా ఇప్పుడు అమెరికాను మించి అగ్ర రాజ్యంగా కొనసాగుతుంది. ఇప్పుడు అమెరికా రెండో స్థానంలో ఉంది. దాంతో దానికి వ్యతిరేకమైన తైవాన్ని ప్రోత్సహిస్తుందని, అలాగే భారత్ ను కూడా ప్రోత్సహించడానికి వచ్చి టార్గెట్ చేస్తుందని అంటున్నారు.