నేషనల్ ఎరోనాటిక్స్ & స్పేస్ ఎడ్మినిస్ట్రేషన్ సంక్షిప్తంగా నాసా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ. ఇదోక ప్రతిష్ఠాత్మక సంస్థ. అయితే గ్రహంతరవాసుల జాడ గురించి బాంబు లాంటి వార్తను పేల్చింది నాసా. భూమికి పొరుగునే ఉన్న శుక్రగ్రహంపై వాటి ఆనవాళ్లను కనుగొన్నట్లు ప్రకటించింది.  నాసా శాస్త్రవేత్తలు వెల్లడించిన వివరాల ప్రకారం "శుక్రగ్రహం లేదా వీనస్ మీద మేఘాల్లో నల్లటి జాడలను కనుగొన్నాం. అక్కడ జీవదార్థాన్ని గుర్తించాం. బహుశా అక్కడే ఏలియన్లు నివసిస్తూ ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. వీలైనంత త్వరలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది" అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Image result for NASA
రాళ్ళతో కూడిన కఠిన నేలను కలిగిన శుక్రగ్రహం పరిమాణం దాదాపుగా భూగ్రహ పరిమాణం అంతే ఉంటుంది. సూర్యునికి అతి దగ్గరలో ఉండటం వలన అత్యధిక వెడిమి ని తనలో నిలుపుకొనటం వలన ఇక్కడ వాతావరణం దారుణంగా అంటే 500 డిగ్రీ సెల్సియస్‌ ఉష్టోగ్రత, దానితో వాతావరణం అంతా ఆమ్లవర్షంతో ప్రతికూల పరిస్థితులను కలిగిఉంటుందన్నారు.
Image result for venus nasa images
ఈ వాతావరణ పరిస్థితులను తట్టుకుని ప్రత్యేక బృందం పరిశోధనలను కొనసాగించబోతోంది అని తెలిపారు. అయితే ప్రత్యేక జీవావరణం అక్కడ ఉన్నటువంటి అత్యధిక ఉష్ణోగ్రతలను తట్టుకొనేలాగా ఉండవచ్చని బావించవలసి ఉంటుంది.   
Image result for aliens
ఇందుకోసం ప్రత్యేక బృందం బయో కెమికల్‌, రసాయనిక అధ్యయనాలు చేపట్టే అవకాశం ఉంది. ఇక 240 మిలియన్ల డాలర్ల వ్యయంతో నాసా ఏలియన్‌ జాడకోసం తన పరిశోధనలను కొనసాగించబోతోంది.  నాసా వాస్తవాలను బయటపెట్టాల్సిందే, ఏలియన్ల మనుగడ విషయంలో నాసా వాస్తవాలను దాస్తోందని బకింగ్‌ హమ్‌ యూనివర్సిటీ పరిశోధనకారుడు, ప్రొఫెసర్‌ బారీ డి గ్రెగోరియో ఆరోపిస్తూ వస్తున్నారు. అంగారక గ్రహంపై గతం లోనే నాసా ఏలియన్ల జాడను కనిపెట్టిందని, "క్యూరియాసిటీ రోవర్‌" అందు కు సంబంధించిన ఫోటోలను కూడా తీసిందని ఆయన వాదించారు. ఈ నేపథ్యంలో నాసా తాజా ప్రకటన ఆసక్తికర చర్చకు దారితీసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: