తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఎంతో మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు.కానీ కొంతమంది మాత్రమే ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసుకుంటారు.అలాంటి వారిలో సీనియర్ ఫిమేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హేమ ఒకరు..ఈమె ఇప్పటి వరకు వందల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. అలా ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో పిన్నిగా.. అత్తగా..వదినగా.. అమ్మగా.. అక్కగా.. ఇలా ఎన్నో పాత్రలు కూడా పోషించింది.అలా స్టార్ హీరోలతో సినిమాలు చేసి చేతినిండా అవకాశాలతో ఇండస్ట్రీలో చాలా బిజీగా ఉండేది. అయితే ఈ మధ్యకాలంలో హేమకి అవకాశాలు తగ్గినప్పటికీ వరుస వివాదాల ద్వారా సోషల్ మీడియాలో హారట్ టాపిక్ గానే ఉంటుంది. ఇక గత ఏడాది హేమ రేవ్ పార్టీలో దొరికి డ్రగ్స్ తీసుకున్నట్టు వార్తలు వినిపించిన సంగతి మనకు తెలిసిందే.

కానీ ఇదంతా ఫేక్ అంటూ ప్రతిసారి హేమ కొట్టి పారేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హేమ తన పర్సనల్ లైఫ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాను గాని ఇప్పటివరకు నాకు ఆ సుఖం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. మరి ఇంతకీ హేమ మాటల వెనుక ఉన్న అర్థం ఏంటి? ఎందుకు అలాంటి మాటలు మాట్లాడింది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. హేమ ఇండస్ట్రీకి వచ్చి 37 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ.. నేను దూరదర్శన్ లో పనిచేస్తున్న టైమ్ లో సయ్యద్ జాన్ అహ్మద్ తో పరిచయం పెంచుకొని కొద్ది రోజుల్లోనే లవ్ లో పడ్డాను.ఆ తర్వాత కొద్ది రోజులకు లవ్ మ్యారేజ్ చేసుకున్నా.

అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ కొన్ని విషయాల్లో మాత్రం నాకు ఎంజాయ్మెంట్ లేదు . నా భర్త చాలా రిజర్వ్డ్ గా ఉండడం వల్ల బయట ఎక్కడా కూడా కనిపించడు. ఏదైనా సినిమా ఫంక్షన్ కి వెళ్దాం.. సరదాగా బయటికి వెళ్దాం అన్నా కూడా రాడు. నేను షూటింగ్ కి వెళ్తే ఉదయాన్నే పని ముగించుకొని వంట చేసి వెళ్తే మళ్ళీ రాత్రి వచ్చి ఇంట్లో పని చేసుకొని వంట చేసి తిని పడుకునేదాన్ని. అలా ఎక్కడికి వెళ్లినా ఈ పని అయితే తప్పదు. ఈ కారణం వల్లే ఎంజాయ్మెంట్ కరువైంది.ఇక కరోనా వచ్చి లాక్ డౌన్ పడ్డ సమయంలో నా ఏజ్ 40.. ఆ సమయంలో కాస్త హార్మోన్స్ చేంజెస్ వల్ల డిప్రెషన్ లోకి వెళ్ళా. అదే టైంలో బిగ్ బాస్ లోకి అవకాశం వస్తే ఎంటర్టైన్మెంట్ కోసం అందులోకి వెళ్ళా.కానీ వారంలోపే హౌస్ నుండి తిరిగి వచ్చేసా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది నటి హేమ..

మరింత సమాచారం తెలుసుకోండి: