టెక్నాలజీ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అదే తరహాలో నష్టాలు కూడా ఉన్నాయి. క్షణాలలో పనులు కంప్లీట్ చేస్తున్న ఈ టెక్నాలజీ మరో కోణంలో చూస్తే అదే రీతిలో మనిషిని మోసం చేస్తుంది. ముఖ్యంగా ఈ కరోనా కష్టకాలంలో చాలా మంది దాచుకున్న డబ్బు కొన్ని ఫేక్ కాల్స్ వలన నష్టపోవడం జరిగింది. ఇదిలా ఉండగా ఈ విధంగా ఆన్లైన్ మోసాల లో ఆరితేరిన ఓ వ్యక్తి ఏకంగా 100 మంది అమ్మాయిలను మోసం చేసిన ఘటన కర్నూలులో చోటు చేసుకుంది. 
 
పూర్తి విషయంలోకి వెళ్తే కర్నూలు జిల్లాకు చెందిన మహ్మద్ హైమద్ సోషల్ మీడియాలో అమ్మాయిల ఫోటోలను సేకరించి వాటిని మార్ఫింగ్ చేసి...మళ్లీ సేమ్ అదే అమ్మాయిలకు ఆ ఫోటోలు పంపి బ్లాక్ మెయిల్ కి తెగబడి వారి దగ్గర డబ్బులు గుంజుతున్న ఘటన తాజాగా బయటపడింది. సోషల్ మీడియాలో దాదాపు ఏడు నెలలుగా ఒక ఎకౌంట్ క్రియేట్ చేసుకుని హైమద్ హైదరాబాద్ కు చెందిన ఓ అమ్మాయి ఫోటోలు మార్ఫింగ్ చేసి సదరు అమ్మాయి అకౌంట్ కె మళ్ళీ పంపడంతో...కొన్నాళ్ళు భయభ్రాంతులకు గురైన ఆ అమ్మాయి...తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఇంటిలోనే బాధ పడుతూ ఉండటం తో ఇది గమనించిన బంధువులు విషయం మొత్తం ఆరా తీయటం జరిగింది. 
 
వెంటనే సైబరాబాద్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వటం తో రంగంలోకి దిగిన పోలీసులు మహ్మద్ హైమద్ ని పట్టుకోవడం జరిగింది. దీంతో పోలీస్ లు తమదైన స్టయిల్ లో కోటింగ్ ఇవ్వగా దాదాపూర్ ఇతని చేతిలో వంద మంది అమ్మాయిలు ఈ రకంగా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు బయటపడటంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. పూర్తి విచారణ లో రెండు తెలుగు రాష్ట్రాలలో ఇతడిపై దాదాపు 10 కేసులు నమోదైనట్టు పోలీసులు గుర్తించారు. ఈ వార్త సోషల్ మీడియాలో రావడంతో చాలా మంది నెటిజన్లు ఇలాంటి వారిని కరోనా బాధితులు ఉండే క్వారంటైన్ లో మాస్కు లేకుండా కూర్చోబెట్టి  ఆ తరువాత ఎన్కౌంటర్ చేసి చంపేయాలని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: