ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో అధికార పార్టీలో కొన్ని సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. ప్రధానంగా పార్టీలో ఉన్న కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలు పార్టీ కోసం పెద్దగా పని చేసే ప్రయత్నం చేయటం లేదు. ఇప్పుడు నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఒక సీనియర్ ఎమ్మెల్యే పార్టీ కోసం పెద్దగా కష్టపడిన పరిస్థితి లేదు అనే విషయం చెప్పవచ్చు. రాజకీయంగా పార్టీ ఇప్పుడు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నా... ఉత్తరాంధ్ర జిల్లాల్లో మాత్రం సీనియర్ ఎమ్మెల్యేలు పెద్దగా కష్టపడలేదు.

అలాగే మాజీ మంత్రులు కూడా కొంతమంది పార్టీ కోసం పని చేసే ప్రయత్నం చేయడం లేదని చెప్పాలి. ప్రస్తుతం మంత్రి బొత్స సత్యనారాయణ కూడా పార్టీ కోసం పనిచేయడం లేదనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. కొందరికి మాత్రమే ఆయన సహకారం అందిస్తున్నారనే ఆవేదన కూడా వైసీపీ కార్యకర్తలలో వ్యక్తమవుతుంది. నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం రామనారాయణ రెడ్డి కూడా పార్టీ కోసం పని చేయడం లేదు. దీంతో పార్టీలో సమస్యలు రోజు కూడా నెల్లూరు జిల్లాలో పెరిగిపోతున్నాయి.

అధికారులు కూడా ఆయనకు సహకరించడం లేదనే ఆవేదన వ్యక్తం అవుతుంది. దీనితో పార్టీలో ముందడుగు వేయలేకపోతున్నారు. అయితే ఇప్పుడు ఇలా ఉంటే ధర్మాన ప్రసాదరావు విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉందని సమాచారం. ఆయన గతంలో మంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి  హయాంలో కూడా కీలక శాఖలు నిర్వహించారు. ఆయన విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సానుకూలంగా ఉన్నట్టుగా సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతుంది. కాబట్టి సీనియర్ నేతలను ముందుకు తీసుకు వస్తే మంచి ఫలితాలు ఉండే అవకాశాలు ఉంటాయి. అందుకే జగన్ ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు ఆనం రాంనారాయణ రెడ్డి విషయంలో సానుకూలంగా ఉన్నారని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: