
ఎంతోమంది ఉద్యోగులు ఉపాధులను కోల్పోయి రోడ్డున పడ్డారు. కానీ గతంలో లాగా జరుగకుండా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని సహాయక చర్యలను తీసుకుంటోంది. ప్రజల ప్రాణాలే పరమావధిగా ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారి ముందుకు వచ్చి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ముందుగా కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని రెట్టింపు వేగంతో చేస్తున్నారు. అంతే కాకుండా ప్రస్తుతం ఈ కరోనాతో పాటుగా పెరిగిన ముఖ్యమైన వస్తువుల ధరలన్నీ పెరగడంతో సామాన్యులు బతుకుబండి నడపడం శక్తికి మించిన పనయింది. దీనితో గతంలో ఎలాగయితే కేంద్ర ప్రభుత్వం...సామాన్యులు తీసుకున్న బ్యాంకు లోన్లు మరియు క్రెడిట్ కార్డు కు సంబంధించి కట్టవలసిన ఇఎమ్ఐ విషయంలో మారటోరియం అనే విధానాన్ని తీసుకు రావడం జరిగింది.
ఇప్పుడు కూడా పరిస్థితులు చేయి దాటుతున్న సమయంలో మళ్ళీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంటుందా అనే సందేహం రుణగ్రహీతలలో నెలకొంది. ఈ విషయంపై నిన్న ఒక ఆన్లైన్ మీడియా మీట్ లో ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ స్పందించడం జరిగింది. కరోనా ఎంత ప్రమాదంగా పరిణమిస్తున్నప్పటికీ బడ్జెట్ లో ప్రతిపాదించిన విషయాలన్నిటినీ ఖచ్చితంగా అమలు పరుస్తామని చెప్పారు. ఈ లోన్లపై గతంలో లాగా మారటోరియం విధించే అవకాశం ప్రస్తుతానికయితే అవకాశం లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. దీనితో రుణగ్రహీతలకు షాక్ ఇచ్చినట్లు అయింది.