భారత్ లో ప్రతి రోజూ లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కొత్త‌గా ఈ జాబిటాలొకి 401078 మందికి కరోనా కాటుకు గురైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వశాఖ 08.05.2021 ఉదయం విడుదల చేసిన నివదిక లో నిర్ధారణ అయిందని తెలిపింది.



ఆ వివరాల ప్రకారం అంతకుముందు రోజు 318609 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 21892676. గడచిన 24 గంట‌లలో 4187 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 238270 కు చేరింది.



లాక్డౌన్ అమలు ద్వారానే కరోన నియంత్రణలోకి వస్తుందని ఋజువౌతున్న వేళ మరి తెలుగు రాష్ట్రాలల్లో లాక్డౌన్ ఊసే కనిపించటం లేదు. లాక్డౌన్ విధిస్తే తప్పితే భారత్ లో కరోనా కేసుల్లో తగ్గుదల నమోదవ్వదని దేశవిదేశాల నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు.



అవసరం పరిస్థితుల అనుగుణంగా లాక్డౌన్ విధించే అంశం రాష్ట్ర ప్రభుత్వాల విధుల్లో చేర్చినట్లు ప్రధాని గతంలోనే చెచెప్పరు. ఆ తరవాత చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్డౌన్ ను అమలు చేస్తున్నారు.



ప్రస్తుతం దేశంలోని 14 రాష్ట్రాల్లో లాక్డౌన్ ను అమలు చేస్తున్నారు. మరికొన్ని రాష్ట్రాల్లో లాక్డౌన్ ను త్వరలోనే విధించబోతున్నారు.



*యూపీ, ఢిల్లీలో మే 10 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది.

*మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మే 15 వరకు లాక్డౌన్ విధించారు

*మహారాష్ట్రలో లాక్డౌన్ అమలు చేయడంతోనే కరోనా వ్యాప్తి కొంతలో కొంత కట్టడి అయినట్లు చెపుతున్నారు.

* కేరళలో ఈరోజు నుంచి మే 16 వరకు లాక్డౌన్ ను అమలు చేస్తారు.

*హిమాచల ప్రదేశ్ లో మే 16 వరకు లాక్డౌన్ గా అమలులో ఉంటుంది.

*తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాల్లో మే 10 నుంచి 24 వరకు లాక్డౌన్ ను విధించనున్నారు.



ఇక తెలుగు రాష్ట్రాల్లో “పూర్తీ లాక్డౌన్” అనే ఊసే లేకుండా పోతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉదయం 6 నుండి 12 గంటల వరకూ మాత్రమే కర్ఫ్యూ అమలులో ఉంది. మిగతా సమయాల్లో నిత్యావసరాలు మందల నిమిత్తం షాపులు తెరిచే ఉంటాయి.



రాత్రి కర్ఫ్యూ తప్ప తెలంగాణలో లాక్డౌన్ గురించి ఆలోచించడం లేదని బల్ల గుద్ది అధికారులు చెప్పిన సంగతి తెలిసిందే.



అంతులేకుండా పెరిగిపోతున్న కరోనా కేసుల సంఖ్య కలవరం కలిగిస్తున్న కారణంగా తెలుగు రాష్ట్రాల్లో కూడా లాక్డౌన్ విధిస్తే మంచిదని నిపుణులు చెబుతూ ఉన్నారు. ఇక తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రమే పూర్తి లాక్డౌన్ పై నిర్ణయం తీసుకోవాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: