జనాల ప్రాణాలు తీయడానికి ఎప్పుడూ ఏదో ఒక వ్యాధి నుంచి వస్తూనే ఉంటుంది.  ఒక వ్యాధికి సంబంధించిన మందు దొరికింది అనుకునే లోపే మరో వ్యాధి కూడా ప్రాణాలు తీసేందుకు సిద్ధమవుతూ ఉంటుంది. దీంతో ఇక ప్రజలు క్షణక్షణం ఏ వ్యాధి ముంచుకొస్తుందో అని ప్రాణభయంతో బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా అసలు మందులేని వ్యాధులు ఎన్నో ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇలా ఇప్పటివరకు మందులేని వ్యాధులలో హెచ్.ఐ.వి కూడా ఒకటి. హెచ్ఐవి ఎయిడ్స్ అనేది కేవలం ఒక దేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా రోజురోజుకు పెరిగిపోతున్న ఒక పెద్ద సమస్య.



 సరైన లైంగిక అవగాహన లేకపోవడం.. విచ్చలవిడి శృంగారం కారణంగా హెచ్ఐవీ సోకుతుంది అన్నది అందరికీ తెలిసిందే. అయితే  హెచ్ఐవి బారిన పడిన తర్వాత జీవితాంతం ఇక హెచ్ఐవి ఎయిడ్స్ తో బాధ పడాల్సిందే. ఇప్పటివరకు ఇక ఈ వ్యాధికి మందు కనుగొనలేకపోయారు శాస్త్రవేత్తలు.  అయితే రోజురోజుకు అవగాహన లేని శృంగారం  కారణంగా ఎంతోమంది హెచ్ఐవి ఎయిడ్స్ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా రోజుకు పెరిగిపోతుంది. అయితే హెచ్ఐవి కి మందు కనుగొనేందుకు ఇప్పటికీ శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. అయితే మొన్నటికి మొన్న కరోనా వైరస్ ను కనుగొని ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టిన ఆక్స్ఫర్డ్ శాస్త్రవేత్తలు.. ఇక ఎప్పుడూ హెచ్ ఐ వి కి మందు కనుగొనేందుకు కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది.




 ఈ క్రమంలోనే పూర్తిస్థాయి హెచ్ఐవి టీకా కోసం ఇటీవలే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రయత్నాలు మొదలు పెట్టింది. HIVconsvx పేరిట ఇటీవలే ఒక వ్యాక్సిన్ లు తయారు చేసింది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ  ఇక దీనికి సంబంధించిన సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించింది.  ఇటీవలే ఈ వ్యాక్సిన్ను 18 నుంచి 65 ఏళ్ల వయస్సు ఉన్న వాలంటీర్ల పై క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా ప్రయోగించిన్నట్లు ఆక్స్ఫర్డ్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక ఈ ప్రయోగాల్లో టీకా భద్రత రోగనిరోధకశక్తిని కూడా తెలుసుకుంటాము అంటూ చెబుతున్నారు. హెచ్ఐవి ని నిరోధించేందుకు చేస్తున్న ప్రయోగాల్లో ఇది ఎంతో కీలకమైనది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు ఆక్స్ఫర్డ్ శాస్త్రవేత్తలు.

మరింత సమాచారం తెలుసుకోండి: