చైనా ఆగడాలు మితిమీరిపోతున్న విషయం తెలిసిందే. దాని వలననే మయన్మార్ లో కొత్తగా ఏర్పాటైన ప్రజాస్వామ్య ప్రభుత్వం విచ్చిన్నం అయిపోయింది. తన దేశంలో సైనిక పాలన మాత్రం విధించడానికి ఒప్పుకోదు కానీ ఇతర దేశాలలో మాత్రం అందుకు పావులు కదుపుతూ తన బుద్ది బయటపెట్టుకుంటుంది. ఎక్కడ ప్రజాస్వామ్య దేశాలు ఎక్కువ అయితే అది తన ప్రజల వరకు వస్తుందో అని అనుమానాలు చైనా అధ్యక్షుడికి ఉన్నట్టే ఉంది, అందుకే నియంత పాలన కొన్ని దేశాలలో అయినా ఉండాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అలాగే మయన్మార్ లో తెచ్చింది, మొన్న ఆఫ్ఘన్ లో కూడా తాలిబన్ నియంత పాలన తెచ్చింది. ఇలా చైనా తన ఆగడాలతో ప్రపంచంలో నియంత పాలన విస్తృతం చేసేందుకు తెరవెనుక నుండి కృషి చేస్తుంది. ప్రజాస్వామ్యం అని ప్రపంచం పరుగులు తీస్తుంటే, ఆ దేశం మాత్రం ఇంకా నియంత పాలనలో ఉంది. దీనిని ఎవరైనా ప్రశ్నిస్తే తన పదవికి గండం అని జిన్ భయపడుతున్నాడు అని ఈ ఘటనలు చెపుతున్నాయి.

ఇక మయన్మార్ లో కూడా ప్రజలు సైనిక పాలపై తీవ్రంగా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇదే సందు కదా అని కొన్ని దౌర్భాగ్య దేశాలు వాళ్లకు ఆయుధాలు అమ్మి సొమ్ము చేసుకుంటున్నాయి. అక్కడి సైన్యానికి చైనా భారీగా ఆయుధాలు అందిస్తున్నదని అందుకే వాళ్ళు తొందరగా సైనిక పాలన తేగలిగారని తెలుస్తుంది. అంతటిలో ఆగకుండా దొరికిన వారిని దొరికినట్టే ఖైదు చేస్తున్నందున ప్రపంచ స్థాయిలో మయన్మార్ సైనిక పాలనపై విమర్శలు కూడా వచ్చాయి. దీనితో ఖైదు చేసిన వాళ్ళను వదిలిపెట్టారు కానీ వాళ్ళను దేశద్రోహులుగా ముద్రించారు. అంతటితో కూడా ఆగలేదు, తాలిబన్ ల మాదిరి, రోడ్డుపైకి సామాన్యుడు పనిమీద వస్తే, అతడిని పిలిచి వింత చేష్టలు చూపిస్తూ మానసిక పైశాచికతను అనుభవిస్తున్నారు.  

ఇలా మయన్మార్ లో తాలిబన్ పాలన తేగలిగింది చైనా. ఎన్ని అన్నా కూడా ఇలాంటి దేశాలలో ప్రశాంతత వచ్చే అవకాశాలు ఇప్పుడప్పుడే కనిపించడం లేదు. ప్రజలు కూడా తగ్గడం లేదు, సైన్యం పై దాడులు, నిరసన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. మయన్మార్, ఆఫ్ఘన్, సూడాన్, సిరియా ఇలా ఒక్కోదేశంలో తుపాకులకు బలైపోతున్న సామాన్య ప్రాణాలను చూస్తూ చైనా అధ్యక్షుడు మానసిక శాంతిని పొందుతున్నట్టు ఉన్నాడు. మనసైన శాస్త్రంలో ఇలాంటి వైద్యలు  కూడా ఉన్నాయట. పెద్దపెద్ద రోగాలకు ఇలాంటి పైశాచికత్వాలు కాస్త ఉపశమనంగా ఉంటాయని ఆ శాస్త్రంలో చెప్పబడ్డాయని నిపుణులు చెపుతున్నారు. బహుశా అలాంటి రోగం జిన్ కు ఉన్నట్టే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: