తెలంగాణ రాష్ట్రంలో తాజాగా వెల్లడైన ఉపఎన్నిక ఫలితాలు చూస్తే, అధికార పార్టీ ని దెబ్బతీయగలిగే ప్రతిపక్ష పార్టీ తయారైనట్టే ఉంది. ఇప్పటి వరకు తనకు తన పార్టీకి ఎదురువచ్చే వాళ్ళు లేరంటూ విర్రవీగిన అధికార పార్టీ ఇప్పటికైనా ప్రజా సంక్షేమాన్ని పట్టించుకుకుంటుందని భావించాలి. అలా కాకుండా రెండే కదా అనుకుంటూ అలాగే నిర్లక్ష్యంగా ఉంటె మటుకు తగిన విధంగా నష్టాన్ని రానున్న ఎన్నికలతోనే చూస్తే అవకాశాలు మెండుగానే ఉన్నాయి. మొదటి నుండి తెరాస లో ఉన్న ఈ అధికార వ్యామోహం లేదా అధికారం ఉంది కదా అనే భరోసా ఆ పార్టీకి తిప్పలు తెచ్చిపెడుతుంది. ఒక్కటి కూడా ఎవరు గెలవలేరు అనే స్థాయి నుండి నేడు రెండు ఉపఎన్నికలు రావడం అవి కూడా కేంద్రం లో ఉన్న బీజేపీ చాకచక్యంగా సొంతం చేసుకోవడం పై అధికార పార్టీ కాస్త మేల్కొనాల్సి ఉంది.

రాష్ట్రంలో తమకు ఎదురులేదు, తిరుగులేదు, ప్రతిపక్షం అన్న మాటే లేదు అనుకుంటున్న తెరాస కు బీజేపీ ఊరికే మాటలలో కాకుండా చేసి చూపెట్టింది. అంటే ఉన్న అధికార తెరాస పార్టీ బాగా అధికార మదంతో ఉందనేది ముందు బీజేపీ గ్రహించగలిగింది. అప్పటి నుండి ప్రణాళిక బద్దంగా అడుగులు వేసుకుంటూ ఎన్నో ప్రాంతీయ పార్టీలను, చివరికి అధికార పార్టీని కూడా వెనక్కి నెట్టి బీజేపీ ముందుకు దూసుకుపోయింది. అంటే ఎక్కడ చిన్న అవకాశం ఉన్నాకూడా దానిని వదిలేయకుండా వడిసిపట్టుకొంటుంది బీజేపీ. అదే తమ పార్టీకి విజయాన్ని చేకూరుస్తుంది. ఈ తరహా ముందడుగు రాష్ట్రంలో ఉన్న ఏ ఇతర ప్రాంతీయ, ఆఖరికి జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కూడా చేయలేకపోయింది.

ప్రతిపక్షం అంటే ఏమిటో మొదటి సారి కేసీఆర్ కు తెలిసివచ్చినట్టే అనిపిస్తుంది ఈ ఉపఎన్నిక గెలుపు చూస్తే. విజయం వరకు అవసరం లేదు, తెరాస లో చిచ్చు పెట్టడం నుండి ఇప్పటి వరకు జరిగిన ప్రతి పరిణామం కూడా అదే తరహాలో ఉంది. దానిని అధికార మదంతో ఉన్న తెరాస గ్రహించలేకపోయింది, అందుకే ఈ నష్టం రెండు వైపులా పదును ఉన్న కత్తి లాగా తయారైంది. ఒకటి తెరాస కు ప్రధాన నేత వెళ్లిపోవడం, రెండు రాష్ట్రంలో తమకు ఎదురుగా మరో పార్టీ నిలబడిందని భరోసా ప్రజలలో రావడం. ఈ రెండు చాలు అధికార పార్టీని తరువాత ఎన్నికలలో కనిపించకుండా చేయడానికి, అది బీజేపీ చేయగలదు కూడా, అందుకు కేసీఆర్ అండ్ పార్టీ ఎలా సిద్ధం అవుతుంది అనేది వచ్చే ఎన్నికల వరకు జరిగే పరిణామాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: