ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన సీఎం జ‌గ‌న్ ఎప్ప‌టి నుంచో పార్టీ నే న‌మ్ముకున్న నేత‌ల‌కు షాక్ ఇచ్చారు. ఈ లిస్టులో ముందు వినిపించే పేరు గుంటూరు జిల్లా కు చెందిన చిల‌క‌లూరి పేట మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌. పార్టీ కోసం ఆయ‌న ఎన్నో త్యాగాలు చేశారు. ఉమ్మ‌డి జిల్లా పార్టీ అధ్య‌క్షుడి గా కూడా ప‌నిచేశారు. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ చెప్పిన వెంట‌నే ఆయ‌న త‌న సీటు విడ‌ద‌ల ర‌జ‌నీకి త్యాగం చేశారు.

ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ చిల‌క‌లూరి పేట ఎన్నిక‌ల ప్ర‌చారం లో రాజ‌శేఖ‌ర్ చేయి లేపి మ‌రీ అన్న‌ను ఎమ్మెల్సీ ని చేసి మంత్రిని చేస్తాన‌ని హామీ ఇచ్చారు. అయితే ఇప్పుడు జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యి రెండున్న ర సంవ‌త్స‌రాలు అవుతుంది. ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌శేఖ‌ర్ కు అస‌లు ఎమ్మెల్సీ యే ఇవ్వ‌లేదు. ఇటీవ‌ల స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇస్తాన‌ని చెప్పి కూడా ఎమ్మెల్సీ ఇవ్వ‌క పోవ‌డం పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ నీయాంశం గా ఉంది.

రాజ‌శేఖ‌ర్ కు ప‌ద‌వి రాకుండా ఎమ్మెల్యే ర‌జ‌నీ అడుగ‌డు గునా అడ్డు త‌గులుతోంద‌నే అంటున్నారు. రాజ‌శేఖ‌ర్ ను రాజ‌కీయంగా అణ గ దొక్కేందుకు ర‌జ‌నీ చేయ‌ని ప్ర‌య‌త్నాలు లేవు. ఇందుకు ఆమెకు ప్ర‌భుత్వం లో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించే ఓ షాడో నేత బాగా స‌పోర్ట్ చేస్తున్న‌ట్టు భోగట్టా ?  త‌మ నేత ర‌జ‌నీ గెలుపు న‌కు క‌ష్ట‌ప‌డితే ఆయ‌న‌కు ప‌ద‌వి రాకుండా ర‌జ‌నీ అడ్డుకున్నార‌ని రాజ‌శేఖ‌ర్ వ‌ర్గం బ‌హిరంగంగానే ఆరోపిస్తోంది.

అంతే కాకుండా పార్టీలోని ఓ ప్ర‌ముఖుడి అండ‌దండ‌ల‌తో ఆమె ఇప్పుడు రెచ్చి పోతున్నా రేపు ఎదురు దెబ్బ‌లు త‌ప్ప‌వ‌ని వారు చెపుతున్నారు. ఇక ర‌జ‌నీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో స‌ద‌రు ఆ టాప్ స‌ల‌హా దారుడి అండ దండ‌ల‌తోనే త‌న‌కు మంత్రి వ‌ర్గం లో చోటు కూడా వ‌స్తుంద‌ని మ‌రీ ప్ర‌చారం చేసుకుంటున్నారు. మ‌రి ఏం జ‌రుగుతుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: