ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటీవల వరుసగా మాట త‌ప్పుతోన్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక సారి జగన్ మాట ఇచ్చారంటే ఆ మాట కచ్చితంగా నెరవేరుస్తారు అన్న అభిప్రాయం అందరిలో ఉండేది. ఈ విషయంలో జగన్ తన తండ్రి ని ఫాలో అవుతున్నారు అని ప్రతి ఒక్కరూ మెచ్చుకున్నారు. రాజశేఖర్ రెడ్డి ఒక మాట ఇస్తే కచ్చితంగా ఆ మాట నెరవేర్చారు... ఇప్పుడు జగన్ కూడా తండ్రిని ఫాలో అవుతున్నాడని అందరూ ప్ర‌శంసించే వారు.

అయితే ఇటీవల జరిగిన పరిణామాలను గమనిస్తుంటే జగన్ మాట ఇచ్చి కూడా త‌ప్పే పరిస్థితి అయితే ఉంది. గుంటూరు జిల్లాకు చెందిన పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ ను జగన్ ఎమ్మెల్సీ తో పాటు మంత్రి ని చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు దాటిపోయింది.. ఇప్పటికే జగన్ ఎన్నోసార్లు ఎమ్మెల్సీలు భర్తీ చేశారు. చివరకు ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఛాన్స్ ఇస్తానని మ‌ర్రికి స్వయంగా హామీ ఇచ్చారు.

అయినా కూడా కొన్ని ఒత్తిళ్లకు తలొగ్గి జగన్  ఆ హామీ నెరవేర్చలేదు. మ‌ర్రిని మంత్రి ని కాదు క‌దా.. కనీసం ఎమ్మెల్సీ కూడా చేయలేక పోయారు. మ‌ర్రి  విష‌యంలో జగన్ మరోసారి మాట త‌ప్పేశారు. ఇదిలా ఉంటే  జ‌గ‌న్ కేబినెట్ ను త్వరలోనే ప్రక్షాళన చేయనున్నారు. ఈ ప్రక్షాళనలో ఈసారి మండలి నుంచి కొంతమందిని మంత్రులుగా తీసుకోబోతున్నారట‌.

గతంలో మండలిని రద్దు చేస్తానని చెప్పిన జగన్.. మండలి నుంచి మంత్రులుగా ఉన్న మోపిదేవి వెంకటరమణ - పిల్లి సుభాష్ చంద్రబోస్ ల‌ను రాజ్యసభకు పంపారు. ఇప్పుడు మళ్లీ మాట తప్పి మండలి నుంచి కొంత మందిని కేబినెట్ లోకి తీసుకు వచ్చే ఆలోచ‌న చేస్తున్న‌ట్టు తెలుస్తోంది ఏదేమైనా. ఈ పరిణామాలు జగన్ కు గొడ్డలిపెట్టుగా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: