పంజాబ్లో తెర మీదికి వచ్చిన ఖలిస్తాన్ ఉద్యమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సిక్కులు అందరిని ఒక దేశం గా భావిస్తూ ప్రత్యేక దేశం ఏర్పాటు చేయాలి అనే నినాదంతో ఖలిస్తాన్ ఉద్యమం తెరమీదికి వచ్చింది. ఖలిస్తాన్ ఉద్యమం కారణంగా దేశంలో ఎంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది ఖలిస్తాన్ ఉద్యమం తెరమీదకు తీసుకువచ్చారు. దేశాన్ని ముక్కలు చేసేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు. ఉద్యమాలు చేపడుతూ నిరసనలు చేస్తూ ఉద్రిక్త పరిస్థితులకు కారణం అయ్యారు అనే చెప్పాలి. అయితే ఒకప్పుడు దేశ ప్రధాని కొనసాగిన ఇందిరా గాంధీ హత్యకు కూడా ఖలిస్తాన్ కారణం అన్న ప్రచారం కూడా జరిగింది.



 అయితే ఇందిరా గాంధీ తర్వాత వచ్చిన రాజీవ్ గాంధీ కంటే పీవీ నరసింహారావు ఖలిస్తాన్ ఉద్యమాన్ని అణచి వేయడంలో కీలక పాత్ర వహించారు అని చెప్పాలి. ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయి మద్దతు ఉండడంతో గిల్ అనే అధికారి ఖలిస్తాన్ ఉద్యమాన్ని అణచి వేయడంలో   విజయం సాధించారు. అయితే ఇలా దేశాన్ని ముక్కలు చేసేందుకు మొదలైన ఖలిస్తాన్ ఉద్యమం ఆ తర్వాత ఎక్కడా కనిపించకుండా పోయింది అని చెప్పాలి. కానీ ఇప్పుడు మరోసారి ఖలిస్తాన్ ఉద్యమం తెరమీదికి వచ్చింది. ఇటీవల పంజాబ్లో ఖలిస్తాన్ ఉద్యమానికి రెఫరెండం ఫామ్స్ కొంతమంది వ్యక్తులు  పంచుతూ ఉండడం హాట్ టాపిక్ గా మారిపోయింది.



 ఈ క్రమంలోనే ఇటీవల పోలీసులు ఏకంగా ఖలిస్తాన్ ఉద్యమానికి సంబంధించి ఫామ్స్ ని పంచుతున్న వారిని గుర్తించి ఇద్దరినీ అరెస్టు చేశారు పోలీసులు. ఖలిస్తాన్ కు అనుకూలంగా బోధనలు చేస్తున్నా ఇద్దరు పంజాబ్లో జాస్మిర్ సింగ్,రవీందర్ సింగ్ అనే ఇద్దరిని అరెస్టు చేశారు. బసూర్ ప్రాంతానికి సమీపంలో ఖలిస్తాన్ కు అనుకూలంగా బోధనలు చేస్తున్న సమయంలో వీరిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. నిందితులిద్దరూ కూడా వివిధ మతపరమైన బహిరంగ ప్రదేశాలను సందర్శిస్తూ ఉన్నట్లు గుర్తించాము అంటూ పోలీసులు తెలిపారు. ఖలిస్తాన్ ఉద్యమం పై ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ప్రజలను ప్రభావితం చేసేందుకు ఈ ఇద్దరు నిందితులు ఇంటింటికి తిరుగుతూ ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: