మింగ మెతుకు లేదు మీసాలకు సంపంగి నూనె అనే సామెత దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ లకు పరిస్థితి ఇలాగే  మారిపోయింది. సుపరిపాలన ఎలా ఉంటుందో మేము చూపిస్తాము అంటూ ఆయుధాలతో అరాచకాలు సృష్టించారు.  ఎన్నో ప్రాణాలు తీసిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని తమ వశం చేసుకున్నారు. ఇక మా పాలనలో అందరికీ మంచి జరుగుతుంది అంటూ చెప్పి ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేశారు. కానీ ఇప్పుడు తాలిబన్ల ప్రభుత్వానికి అడుగడుగునా చిక్కులు ఎదురవుతున్నాయి. ప్రపంచ దేశాలతో సంబంధాలు తెగిపోవడంతో ఒకవైపు నుంచి ఆర్థిక సంక్షోభం మరోవైపు నుంచి ఆహార సంక్షోభం కూడా చుట్టుముడుతూనే ఉంది.



 అయినప్పటికీ బుద్ధి మార్చుకొని తాలిబన్లు ఆ దేశ ప్రజల విషయంలో దారుణంగా వ్యవహరిస్తూనే ఉన్నారు. ఇస్లామిక్ చట్టాలు అమలులోకి తీసుకు వచ్చి ప్రజలందరినీ బానిసలుగా చూస్తున్నారు. ఇక మహిళలను అయితే ఇంటి నుంచి కాలు బయట పెట్టడానికి కూడా వీలు లేదు అంటూ ఆంక్షలు విధిస్తూ ఉండటం గమనార్హం. ఇక ఆర్థిక సహాయం కోసం ప్రపంచ దేశాల దగ్గర అడ్డుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది తాలిబన్లకు. అయితే ఆఫ్ఘనిస్తాన్లో ఆహార సంక్షోభం పెరిగిపోయిన నేపథ్యంలో ప్రజల ఆకలి కేకలను తీర్చేందుకు ప్రపంచ దేశాలు పెద్దమనసు చేసుకుని ఆప్ఘనిస్తాన్ కు గోధుమలను పంపించాయి.



 అయితే ప్రజల ఆకలి తీర్చేందుకు పంపించిన గోధుమలను ఇక ఇప్పుడు తాలిబన్లు జీతాల రూపంలో ఇస్తున్నారు అన్న విషయం బయటపడింది. తాలిబన్ పాలకుల దగ్గర ఉద్యోగులుగా కొనసాగుతున్న వారు ఉగ్రవాదం లో సీనియర్ గా ఉన్న వారిని జీతాలు పెంచారు అట తాలిబన్లు. ఇదివరకు 20 కిలోల గోధుమలు వారికి ఇస్తే ఇప్పుడు మాత్రం 35 కిలోల గోధుమలు వారికి ఇస్తున్నారట. ఇలా ఒక వైపు ప్రజలందరూ ఆకలితో అలమటిస్తున్న పట్టించుకోని తాలిబన్లు.. జీతాలు ఇచ్చేందుకు డబ్బులు కూడా లేక ఇక గోధుమలను జీతాలుగా చెల్లిస్తూ ఉండటం గమనార్హం. ఇక ఆఫ్ఘనిస్తాన్  పరిస్థితులపై అటు విశ్లేషకులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: