ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కేసును కొన్నాళ్ల క్రితం సీబీఐ తీసుకుంది. తాజాగా సీబీఐ నుంచి వెలువడిన ఓ చార్జ్ షీట్‌లో అంతా వైఎస్ అవినాశ్ రెడ్డి, అతని అనుచరులే ఈ హత్యకు పాల్పడి ఉండొచ్చన్న వార్తలు వచ్చాయి. అయితే వారే హత్య చేశారు అని గట్టిగా చెప్పే ఆధారాలు వీరికి దొరకలేవు. ఇలాంటి సమయంలో వైఎస్ వివేకా హత్య కేసు అంతా చంద్రబాబు అండ్ కో పనే అని తెలుగు దేశం అనుకూల మీడియా ప్రచారం చేసింది. 



వివేకానంద రెడ్డి హత్య అనేది చాలా కీలకమైన ఇష్యూ. అయితే.. ఈ హత్య జరిగింది సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల ముందే. ఇప్పుడు మరో రెండు నెలల్లో మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి. అయితే.. ఈ కేసు గురించి తాజాగా మీడియాతో మాట్లాడిన చంద్రబాబు.. పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. వివేకా హత్య కేసు గురించిన అనేక విషయాలను ఆయన వెలుగు లోకి తెచ్చారు. అయితే ఇంత సీరియస్ అంశాన్ని చంద్రబాబు సిల్లీగా చెప్పడం వల్ల రావాల్సినంత ఫీలింగ్‌ను ఈ అంశం తీసుకురాలేకపోయింది. 



తాజాగా ఓ మీటింగ్‌లో వివేకా హత్య గురించి ప్రస్తావించిన చంద్రబాబు.. అసలు వివేకా హత్య కేసులో బయటి వారి ప్రమేయం ఉన్నట్టు  ఎలాంటి ఆధారమూ లేదని గుర్తు చేశారు. అయితే.. ఎవరైనా సుపారీ తీసుకుని కూడా ఈ హత్య చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ హత్య కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పే భావంలో చంద్రబాబు కాస్త కామెడీగా మాట్లాడారు. 



ఆయన ఏమన్నారంటే..” అవును.. వివేకాకు గుండెపోటు అని మొదట చెప్పింది నేనే.. ఆ తర్వాత వివేకా ఇంట్లోని బెడ్రూమ్‌లో ఉన్న రక్తపు మరకలను నేనే తుడిపించా.. ఆ తరవాత అవినాష్ రెడ్డిని కూడా నేనే పిలిపించా.. ఆరోజు అక్కడ ఉందంతా నా శిష్యులే కదా.. అవినాశ్ రెడ్డి, భరత్ రెడ్డి.,చి వరకు జగన్ రెడ్డి కూడా మన టీమ్‌ మెంబరే.. అంటూ సెటైర్లు పేల్చాలు. చివరు వీళ్లు కాపురాలు కూడా నాకు చెప్పే చేసుకుంటారేమో అని ఆయన వెటకారం ఆడారు.

మరింత సమాచారం తెలుసుకోండి: