కొత్త టీమ్ ప్రకటించడాని ఏపీ సీఎం జగన్ ఆల్రడీ మహూర్తం ఖరారు చేశారు. ఈనెల 15న జరిగే వైసీఎల్పీ భేటీలో మంత్రి మండలి పునర్ వ్యవస్థీకరణకు సంబంధించి కీలక ప్రకటన విడుదలవుతుందని అంటున్నారంతా. దీనికి సంబంధించి శుక్రవారం కేబినెట్ భేటీలో లీకులు కూడా ఇచ్చారని, 15న పూర్తి సమాచారం తెలుస్తుందని చెబుతున్నారు. అయితే గతంలో అనుకున్నట్టు పూర్తిగా కొత్తవారితో మంత్రి మండలి కొలువుదీరే అవకాశం లేదని తెలుస్తోంది. పాత ముఖాలు కూడా కనిపిస్తాయట. అయితే కేబినెట్ లో కొనసాగేవారు ఎవరు అనేదే ఇప్పుడు చర్చనీయాంశమైంది.

మీడియాలో ప్రముఖంగా కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. పురపాలక శాఖ మంత్రిగా ఉన్న బొత్స సత్యానారాయణ కొత్తగా ఏర్పడే కేబినెట్‌ లో కూడా కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని, మరో మంత్రి కొడాలి నాని, బాలినేని శ్రీనివాసులరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి.. ఇలా ఓ టీమ్ ని జగన్ తన వద్దే ఉంచుకుంటారని అంటున్నారు. అయితే వీరిలో ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు, అసలు మొత్తం మారిపోతారా అనేది అధికారికంగా తెలియదు. అందుకే ముందుగానే జగన్ చిన్న హింట్ ఇచ్చారు. పనితీరు ఆధారంగా మంత్రి వర్గాన్ని మార్చడంలేదని, కేవలం పార్టీ అవసరాలు, ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, కొత్తవారికి అవకాశమివ్వాలనే ఉద్దేశంతోనే పార్టీని మారుస్తున్నామని చెప్పారట.

ఎన్నికల మూడ్ లోకి జగన్
ఎలక్షన్ కి ఇంకా రెండేళ్లకు పైగా టైమ్ ఉండగానే.. ఏపీలో జగన్ టీమ్ పూర్తిగా ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోతోంది. ఇప్పటి నుంచే సీఎం జగన్ ఎన్నికలకోసం కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. గ్రౌండ్ వర్క్ చేసేందుకు కొంతమందిని మంత్రి పదవుల్లోనుంచి తప్పించి పార్టీ బాధ్యతలు అప్పజెబుతున్నారు. ఈనెల 15న జరిగే వైసీపీ లేజిస్లేటివ్ పార్టీ మీటింగ్ లో అన్ని విషయాలు బయటకొస్తాయి. మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణతో పాటు, ఎన్నికల వ్యూహాలపై  కూడా పార్టీ నేతలతో జగన్ చర్చించే అవకాశముంది. దానికి తగ్గట్టుగానే పదవుల పందేరం మొదలవుతుంమది. సీనియర్లకు పూర్తిగా పార్టీ బాధ్యతలు అప్పగించి, కొత్త వారిలో కొంతమందిని మంత్రులుగా నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నారట జగన్.


మరింత సమాచారం తెలుసుకోండి: