గత ఎన్నికల్లో అంటే జగన్ గాలిలో టీడీపీకి కంచుకోట లాంటి కృష్ణా జిల్లాలో వైసీపీ నేతలు అద్భుతమైన విజయాలు సాధించారు గాని..ఈ సారి మాత్రం ఆ నేతలని జగన్ గాలి కూడా కాపాడలేదని తెలుస్తోంది..ముఖ్యంగా సీనియర్ వైసీపీ ఎమ్మెల్యేలకు ఈ సారి కృష్ణాలో చుక్కలు కనబడేలా ఉన్నాయి..అసలే జగన్ గాలి తగ్గడం, టీడీపీ హవా పెరగడం, వైసీపీ పాలనపై వ్యతిరేకత పెరగడం, టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకోవడం లాంటి అంశాలు సీనియర్ ఎమ్మెల్యేలకు శాపంగా మారాయి.

గత ఎన్నికల్లో అంటే టీడీపీపై వ్యతిరేకత, పవన్ సెపరేట్ గా పోటీ చేయడం, జగన్ గాలి, ఒక్క ఛాన్స్ ప్రభావం ఇలా పలు రకాల అంశాలు వైసీపీ నేతలకు కలిసొచ్చాయి...ఈ సారి మాత్రం బొమ్మ రివర్స్ అవుతుంది. వచ్చే ఎన్నికల్లో కృష్ణాలో వైసీపీ ఎమ్మెల్యేలు గట్టిగా దెబ్బతినేలా ఉన్నారు. ఇప్పటికే జూనియర్ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత బాగా పెరిగిందని తెలుస్తోంది..ఇప్పుడు నిదానంగా సీనియర్ ఎమ్మెల్యేలపై కూడా వ్యతిరేకత పెరిగిందని అర్ధమవుతుంది.

ఈ సారి మాత్రం కృష్ణాలో మెజారిటీ సీనియర్ ఎమ్మెల్యేలు ఓడిపోయే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి..అలా ఓటమికి దగ్గరలో ఉన్న సీనియర్లు వచ్చి మచిలీపట్నం నుంచి మంత్రి పేర్ని నాని ముందు వరుసలో ఉన్నారు..2004, 2009, 2019 ఎన్నికల్లో మూడుసార్లు గెలిచిన నానికి..2024 ఎన్నికల్లో గెలిచే అవకాశాలు తక్కువ కనిపిస్తున్నాయి..టీడీపీ-జనసేన పొత్తు అంశం పేర్నికి బాగా మైనస్ అయ్యేలా ఉంది. ఇక పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథికి నెగిటివ్ ఎక్కువ కనిపిస్తోంది. కమ్మ వర్గం ప్రభావం ఉన్న పెనమలూరులో ఈ సారి సైకిల్ సవారీ జరిగేలా ఉంది.

ఇక విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పరిస్తితి కూడా మెరుగ్గా కనిపించడం లేదు..జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు నెగిటివ్ ఎక్కువే ఉంది..అలాగే విజయవాడ వెస్ట్‌లో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌కు టీడీపీ-జనసేన పొత్తు ఎఫెక్ట్ కానుంది. నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌కు కూడా ఈ సారి గెలిచే అవకాశాలు తక్కువ ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: