ఈ సారి హిందూపురంలో బాలయ్య ప్రత్యర్ధి మారుతారా? అంటే ఏమో అవకాశం లేకపోలేదనే చెప్పొచ్చు...మామూలుగా హిందూపురం అంటే టీడీపీకి కంచుకోట...అందులోనూ నందమూరి ఫ్యామిలీ అడ్డా..ఇక్కడ మరొక పార్టీ గెలుపు ఊహించలేం..ఊహించడమే కాదు..గెలవడం కూడా జరగలేదు...ఇక టీడీపీ విజయాలు అన్‌స్టాపబుల్...అయితే ఈసారి ఎలాగైనా ఇక్కడ టీడీపీకి చెక్ పెట్టాలని చూస్తుంది.

అయితే హిందూపురంలో బాలయ్యని ఓడించడం అనేది చాలా కష్టమైన పని...2014, 2019 ఎన్నికల్లో వరుసగా బాలయ్య గెలిచేసిన విషయం తెలిసిందే...ఇక 2024లో కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టడానికి బాలయ్య రెడీ అయ్యారు...ఆ హ్యాట్రిక్‌ని అడ్డుకోవాలని వైసీపీ ప్లాన్ చేస్తుంది..కాకపోతే ప్రస్తుతం హిందూపురం వైసీపీ బాధ్యతలు చూసుకుంటున్న ఇక్బాల్...ఇప్పుడు అక్కడ పెద్దగా పుంజుకోలేదు. 2014లో ఇక్కడ బాలయ్యపై నవీన్ నిశ్చల్ పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. కానీ 2019 ఎన్నికల్లో జగన్...నవీన్‌ని పక్కన పెట్టి ఇక్బాల్‌కు ఛాన్స్ ఇచ్చారు.

ఎందుకంటే హిందూపురంలో ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నాయి...ఇక్బాల్‌ని పెడితే ముస్లిం ఓట్లు కలిసొస్తాయని అనుకున్నారు...కానీ ఇక్కడ ముస్లింలు ఎక్కువగా బాలయ్య అభిమానులు..వారే బాలయ్య గెలుపు కారణం. రెండుసార్లు బాలయ్య మంచి మెజారిటీలతో గెలవడానికి కారణం..ముస్లిం ఓటర్లే. అంటే వైసీపీ నుంచి ముస్లిం అభ్యర్ధిని పెట్టిన ఉపయోగం లేదు..ఇప్పటికీ ఇక్బాల్ అక్కడ పనిచేస్తున్నారు...పైగా ఆయనకు ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు.

అయినా సరే పెద్దగా  ప్రయోజనం ఉన్నట్లు కనిపించడం లేదు...ఇప్పటికీ అక్కడ వైసీపీ బలం పెరగలేదు..వైసీపీ నేత ఇక్బాల్ హిందూపురంలో ఉండి పనిచేస్తున్న ఉపయోగం లేదు...ఇక బాలయ్య అందుబాటులో లేకపోయినా సరే, ఎప్పటికప్పుడు హిందూపురం ప్రజల బాగోగులు చూసుకుంటారు. పరోక్షంగా వారికి అండగా ఉంటారు..టీడీపీ నేతల ద్వారా హిందూపురం ప్రజలకు కావల్సిన పనులు చేసి పెడతారు..అందుకే అక్కడి ప్రజలు బాలయ్యని ఎక్కువ అభిమానిస్తారు.

అందుకే అక్కడ వైసీపీ బలం పెరగడం లేదు..వైసీపీ బలం పెంచడంలో ఇకాబాల్ కూడా విఫలమవుతున్నారు...కాబట్టి నెక్స్ట్ ఎన్నికల్లో ఈయన్ని మార్చేసి...వేరే నేతని నిలబెడతారా? లేక ఈయన్నే కంటిన్యూ చేస్తారా? అనేది చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: