అవసరానికి మించి వాడుకుని తర్వాత వదిలేయటంపై ఇపుడు జనాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. చర్చ ఎందుకు జరుగుతోందంటే జగన్మోహన్ రెడ్డిపై ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు చేసిన కామెంట్లే కారణం. చంద్రబాబు మాట్లాడుతు విజయమ్మ పార్టీ గౌరవాధ్యక్షురాలిగా రాజీనామా చేయటంపై మండిపడ్డారు. ముందు చెల్లిని ఇపుడు తల్లిని వాడుకుని వదలించుకున్నారంటు చంద్రబాబు పదే పదే ఎద్దేవాచేస్తున్నారు.






ఇదే విషయంలో చంద్రబాబు వాడకాన్ని వైసీపీ జనాలు గుర్తుచేస్తున్నారు. మాజీమంత్రులు కొడాలినాని, పేర్నినాని మాట్లాడుతు అవసరానికి వాడుకుని తర్వాత అవతలకు తరిమేయటంలో చంద్రబాబును మించినవారు లేరంటు మండిపడ్డారు. మాజీ మంత్రులిద్దరు చెప్పిందానికి జనాలు కూడా కన్వీన్సవుతున్నారు. ఎందుకంటే  అవసరానికి దగ్గరకు తీసుకుని ఫుల్లుగా వాడేసుకుని అవసరం తీరిపోయిందనగానే అవతల పారేయటంలో చంద్రబాబునాయుడుకు మించి ఎవరుండరన్న విషయం అందరికీ తెలిసిందే. అవసరానికి ఎంతమందిని వాడుకుని వదిలేశారో లెక్కేలేదు. 






పిల్లనిచ్చి పెళ్ళిచేసిన ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడవటంలో చంద్రబాబు చాలామందినే వాడుకున్నారు. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరావు, ఆయన భార్య దగ్గుబాటి పురందేశ్వరి, కొడుకులు నందమూరి హరికృష్ణ, బాలకృష్ణలను ఫుల్లుగా వాడేసుకున్నారు. ఎన్టీయార్ ను వెన్నుపోటు పొడిచి ఆయన చనిపోయిన తర్వాత వెంటనే దగ్గుబాటిని వదిలించుకున్నారు. దగ్గుబాటి కారణంగా పురందేశ్వరి కూడా దూరమైపోయారు. తర్వాత హరికృష్ణను మంత్రిని చేసి ఆరుమాసాల తర్వాత ఆయన్నీ వదిలించుకున్నారు. ఆ తర్వాత బాలకృష్ణను చూడా పక్కనపెట్టేశారు.






2009 ఎన్నికల్లో జూనియర్ ఎన్టీయార్ ను ప్రచారానికి వాడుకుని పూర్తిగా పక్కనపెట్టేశారు. 2018 ఎన్నికల్లో హరికృష్ణ కూతురు సుహాసినిని కుకట్ పల్లి నియోజకవర్గం నుండి పోటీచేయించారు. ఆమె ఓడిపోగానే మళ్ళీ మొహం చూడలేదు. కొడుకు నారా లోకేష్ ను మాత్రం ఎంఎల్సీని చేసి మంత్రిపదవుల్లో కూర్చోబెట్టారు. మరదేపని సుహాసిని విషయంలో ఎందుకు చేయలేదు. కాబట్టి వాడుకుని వదిలేయటంలో చంద్రబాబుతో పోటీపడగలిగిన వాళ్ళు బహుశా దేశం మొత్తంమీద ఇంకెవరూ ఉండరేమో. వాడుకుని వదిలేయటంలో ఇంతటి ఘనచరిత్రున్న చంద్రబాబు కూడా జగన్ను విమర్శించటమే విచిత్రంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: