అప్పుడెప్పుడో వైశ్రాయ్ హోటల్ దగ్గర మొదలైన చంద్రబాబునాయుడు రాజకీయానికి ఇపుడు నోవాటెల్ హోటల్లో ముగింపుకు వస్తోందా ? జరుగుతున్న రాజకీయ పరిణామాలు చూస్తుంటే అందరిలో ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ముల్లును ముల్లుతోనే తీయాలనే సిద్ధాంతాన్ని బీజేపీ చంద్రబాబు మీద ప్రయోగించేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లుంది. ఎన్టీయార్ ను వెన్నుపోటు పొడిచి పార్టీ అధ్యక్షపదవితో పాటు ముఖ్యమంత్రి పీఠాన్ని కూడా చంద్రబాబు లాక్కున్న విషయం అందరికీ తెలిసిందే.





తొందరలో అదే పద్దతిలో చంద్రబాబును పార్టీకి దూరం చేసేందుకు బీజేపీ అగ్రనేతలు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నోవాటెల్ హోటల్లో జూనియర్ ఎన్టీయార్ తో భేటీ అయ్యారట. అంటే తన తాత చేజారిపోయిన పార్టీ పగ్గాలను మళ్ళీ చేతికి తీసుకోవాలని మనవడు జూనియర్ గనుక అనుకుంటే అందుకు అవసరమైన అండదండలు అందిస్తామని అమిత్ హామీ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.





జూనియర్ సేవలను పార్టీకి ఉపయోగించుకునే ఉద్దేశ్యాన్ని జూనియర్ ముందు అమిత్ ఉంచారట. తమ ప్రతిపాదనకు జూనియర్ గనుక సానుకూలమైతే మిగిలిన విషయాలను తమకు వదిలిపెట్టేయాలని కూడా అమిత్ చెప్పారట. ఏ సంగతి బాగా ఆలోచించుకుని తమకు చెప్పమని కూడా స్పష్టంగా చెప్పారట. అంటే ఒకవేళ అమిత్ ప్రతిపాదనలకు జూనియర్ సానుకూలంగా ఉంటే మరోసారి అమిత్-జూనియర్ మధ్య భేటీ జరిగే అవకాశముంది.






తెలుగురాష్ట్రాల్లో బలపడాలని అనుకుంటున్న బీజేపీ అందుకు అందుబాటులో ఉన్న ప్రతి మార్గాన్ని చూస్తోంది. ఇందులో భాగంగానే జూనియర్ సేవలను ఉపయోగించుకోవటం. జూనియర్ సేవలు ఉపయోగించుకోవాలంటే చంద్రబాబునాయుడే ప్రధాన అడ్డంకి. ఎన్టీయార్ అభిమానులు, టీడీపీ అభిమానులు జూనియర్ అభిమానులుగా మారారు. వీళ్ళందరినీ తనకు అనుకూలంగా మలచుకోవాలంటే ఇండివిడ్యువల్ గా సాధ్యంకాదు. టీడీపీ బాధ్యతలు లేకుండా కేవలం నటుడిగా మాత్రమే అందరినీ ఆకర్షించటం సాధ్యంకాదు. సినీ గ్లామర్ కు తోడు పార్టీ గ్లామర్ కూడా ఉంటేనే బీజేపీ అనుకున్నది జూనియర్ ద్వారా చేయించటం తేలికవుతుంది. మరి అమిత్ ప్రతిపాదనలకు జూనియర్ స్పందన ఎలాగుంటుందనేది ఆసక్తిగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: