ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అంటే నరేంద్రమోడి అగ్గిమీద గుగ్గిలమైపోతున్నారు. ఎలాగైనాసరే ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని దింపేయాల్సిందే అని శతవిధాల ప్రయత్నిస్తున్నారు. తనప్రయత్నాలు సాగకపోయేసరికి నానా విధాలుగా రాచిరంపాన పెడుతున్నారు. తాజాగా ఆప్ ఎంఎల్ఏల్లో కొందరిని లోబరుచుకునేందుకు ప్రలోభాలు మొదలుపెట్టారని కేజ్రీ ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.





సరే నాన్ బీజేపీ ప్రభుత్వాలను ఏదోవిధంగా అస్ధిరపరచచటం, కూల్చేయటం మోడీకి మామూలైపోయింది. అయితే ఆప్ అధినేత కేజ్రీవాల్ మీద మోడీకి ఎందుకింత మంటగా ఉంది ? అన్నదే అసలైన ప్రశ్న. దీనికి సమాధానం ఏమిటంటే రాబోయే డిసెంబర్లో జరగబోయే గుజరాత్ ఎన్నికలే కారణమని సమాధానం వినిపిస్తోంది. గడచిన 27 ఏళ్ళుగా గుజరాత్ లో అధికారంలో ఉన్న బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఉపయోగం కనబడలేదు.





ఈ నేపధ్యంలో వచ్చే ఎన్నికల్లో ఆప్ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. మొత్తం 182 అసెంబ్లీ సీట్లలో పోటీచేయాలని ఇప్పటికే డిసైడ్ అయిపోయింది. అభ్యర్ధుల ఎంపిక కూడా అయిపోయింది. ఎలాగైనా బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టడమే కేజ్రీవాల్ టార్గెట్ గా పెట్టుకున్నారు. చూస్తుంటే కేజ్రీ ప్రయత్నం నెరవేరేట్లుగానే ఉంది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వంపై జనాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోయిందట. 27 ఏళ్ళుగా అధికారంలో ఉన్నప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండానే ఉంటుందా ?  వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపు అంత సులభంకాదని మోడీకి కూడా అర్ధమైపోయిందట.





అంటే వచ్చే ఎన్నికల్లో ఆప్ అధికారంలోకి వచ్చేస్తుందని కేజ్రీ కూడా అనుకోవటంలేదు. ఎందుకంటే ముందు కాంగ్రెస్ పార్టీని దెబ్బకొడితే అప్పుడు బీజేపీని కొట్టవచ్చన్నది కేజ్రీ ప్లాన్. అయితే బీజేపీ నుండి ఆప్ కు ఎంతదెబ్బ పడితే కాంగ్రెస్ కు అంత ప్లాస్సన్నట్లుగా ఉంది పరిస్ధితి. ఇక్కడే మోడీలో టెన్షన్ పెరిగిపోతోందట. ఆప్ గెలవలేకపోయినా బీజేపీ ఓటమికి కారణమవటం మాత్రం ఖాయమనే అభిప్రాయాలు పెరిగిపోతున్నాయట. అందుకనే కేజ్రీ అంటేనే మోడీ మండిపోతున్నారు. గుజరాత్ ఎన్నికల్లోగానే ఢిల్లీలో కేజ్రీని దెబ్బకొట్టాలని మోడీ పట్టుబడుతున్నది ఇందుకే.

మరింత సమాచారం తెలుసుకోండి: