ఏపీలో రాజకీయాలు చూస్తుంటే అసలు ఏమి జరుగుతోందో అర్ధం కావడం లేదు. గత ఎన్నికల సమయంలో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏపీ ప్రజలు తుక్కు తుక్కుగా ఓడించారు. అయితే దీనికి కారణాలుగా అవినీతి పాలన, రాజధాని నిర్మాణంలో అవకతవకలు లాంటి వివిధ రకాలుగా చూపించారు. అదే సమయంలో వైఎస్సార్ పుత్రుడు మరియు జగన్ పాదయాత్ర ల వలన వైసీపీ గెలిచింది అని తెలిసిందే. ఇది మాత్రమే కాకుండా తమ మేనిఫెస్టో కూడా ప్రజలను ఆకట్టుకునే విధంగా ఉండడం... ప్రత్యేకంగా నవరత్నాల వలన దాదాపుగా ఆకర్షితులు అయ్యారు. అలా అధికారంలోకి వచ్చిన జగన్ నవరత్నాలను అమలు చేయడానికి ఎక్కడా తగ్గలేదు. అయినప్పటికీ జగన్ పై తీవ్ర వ్యతిరేకత నెలకొంది.

అయితే ఈ వ్యతిరేకత కేవలం సరైన అభివృద్ధి జరగకపోవడం, రాష్ట్రానికి పరిశ్రమలు రాకపోవడం, ఏపీలో ప్రత్యేక హోదా తీసుకురాకపోవడం వంటి కొన్ని విషయాలు మైనస్ లుగా మారి కొని వర్గాల ప్రజలకు దూరం అయింది అంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక రానున్న ఎన్నికలకు కేవలం ఒకటిన్నర సంవత్సరం మాత్రమే సమయం ఉంది. ఈ సమయంలో వైసీపీ మీద ఏర్పడ్డ వ్యతిరేకతను వాడుకుని టీడీపీ మళ్ళీ అధికారాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. అందుకే చంద్రబాబు తన ప్లస్ లు అయిన వాటిని ఉపయోగించుకుని వైసీపీ ని దెబ్బ తీయడానికి చూస్తున్నారు.

చంద్రబాబుకు ప్రజలలో ఇంత పేరు రావడానికి కారణం.. తన యొక్క దూరదృష్టి, విదేశాల నుండి పరిశ్రమలను తీసుకురావడం, కొన్ని ముఖ్యమైన పధకాలను ప్రవేశ పెట్టి వాటిని కొనసాగించడం.. లాంటి కొన్ని ప్రధాన కారణాల వలన మళ్ళీ చంద్రబాబు రావాలని కోరుకుంటున్నారు. ఈ విషయాలను తన ప్రధాన అస్త్రాలుగా తీసుకుని జగన్ ను ఓడించడానికి చంద్రబాబు రెడీ అవుతున్నారట. త్వరలోనే ముఖ్యమైన నియోజకవర్గాలలో ప్రజలను కలవనున్నారు అని తెలుస్తోంది.  








 

   

మరింత సమాచారం తెలుసుకోండి: