చంద్రబాబునాయుడు వైఖరి చాలా విచిత్రంగా ఉంటోంది. గన్నవరం టీడీపీ ఆఫీసు మీద దాడి నేపధ్యంలో జనాలందరినీ కావాలనే రెచ్చగొడుతున్నట్లున్నారు. దాడి ఘటన నేపధ్యంలో  జనాలకు బహిరంగ లేఖ రాశారు. అందులో వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రజల ధన, మాన ప్రాణాలకు తీవ్ర విఘాతం కలుగుతోందన్నారు. ప్రజల ధన, మాన, ప్రాణాలకు వచ్చిన నష్టం ఏమిటో అర్ధం కావటంలేదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ముఖ్యమంత్రిగా ఎవరున్నా జరిగే గొడవలు జరుగుతునే ఉంటాయి.





ఇంకా గట్టిగా చెప్పాలంటే చంద్రబాబు హయాంలో కూడా ఈ గొడవలన్నీ జరిగినవే. అప్పట్లో మెజారిటి మీడియా మద్దతుగా ఉంది కాబట్టి ఎక్కువ ఘటనలు హైలైల్ కాలేదు. అలాగే వైసీపీ ఎంఎల్ఏలు, నేతలపైన కూడా దాదులు జరిగాయి. చెరుకులపాడు నారాయణరెడ్డి, ప్రసాదరెడ్డి లాంటి కొందరు వైసీపీ నేతలు హత్యకు గురయ్యారు. ఇపుడు గన్నవరంలో జరిగిన గొడవకు టీడీపీ నేత పట్టాభి రామే కారణమని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.





కారణమెవరు అనే విషయాన్ని పక్కనపెట్టేస్తే ఈ గొడవకు మామూలు జనాలకు ఎలాంటి సంబంధంలేదు. వైసీపీ-టీడీపీ మధ్య ఆధిపత్య గొడవలు జరుగుతున్నాయంతే. ఈ నేపధ్యంలోనే పార్టీ ఆఫీసుపై దాడి జరిగింది. పార్టీ ఆఫీసుపై దాడులు, నేతలపై భౌతిక దాడులు జరగటం తప్పే. ఇక్కడ గమనించాల్సిందేమంటే రెండుపార్టీల నేతల్లో ఎవరికి అవకాశముంటే వాళ్ళు ప్రత్యర్ధులపై దాడులు చేసుకుంటున్నారు. వీళ్ళ పరస్పర దాడులకు జనాల ధన, మాన, ప్రాణాలకు ఎలాంటి సంబంధంలేదు.





వాస్తవాలు ఇలాగుంటే చంద్రబాబు మాత్రం తమ రక్షణకు జనాలను రెచ్చగొడుతున్నట్లుంది. క్షేత్రస్ధాయిలో ఏమి జరుగుతున్నదో గ్రహించలేనంత అమాయకులా జనాలు ? రెండుపార్టీల మధ్య గొడవలను తమకందరికీ పులమాలని చూస్తే జనాలు అంగీకరిస్తారా ? చంద్రబాబు రెచ్చగొడితే రెచ్చిపోయేంత బలహీన మనస్కులు కాదు జనాలు. పట్టాభి ఒంటిపై దెబ్బలే లేవని డాక్టర్లు నిర్ధారించిన తర్వాత కూడా పట్టాభిని పోలీసులు కొట్టారంటు చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. ఇక్కడే చంద్రబాబు కుట్రలేంటో అర్ధమైపోతోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: