గడచిన ఏడు దశాబ్దాలుగా తనకు ఎదురేలేదనిపించుకున్న రామోజీరావుకు ఇపుడు మాత్రం మోతెక్కిపోతోంది. ఒకవైపు ఏపీ ప్రభుత్వం తరపున సీఐడి మరో వైపు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వాయించేస్తున్నారు. వీళ్ళిద్దరి ధాటికి తట్టుకోలేక సంబంధంలేని వాళ్ళందరినీ తనకు రక్షణగా రామోజీ అడ్డుపెట్టుకుంటున్నారు. తాజాగా వైసీపీ సస్పెండెడ్ ఎంఎల్ఏ కోటంరెడ్డి శ్రీధరరెడ్డి మాట్లాడుతు ఉండవల్లి ఢిల్లీకి ఎందుకు వెళ్ళారని ప్రశ్నించటమే విచిత్రంగా ఉంది.





రామోజీ మీద అసత్యాలు, ఆరోపణలు చేయటానికి ఢిల్లీకి వెళ్ళారని కోటంరెడ్డి ఆరోపించారు. ఉండవల్లి ఢిల్లీకి వెళితే కోటంరెడ్డికి ఎందుకసలు ? మార్గదర్శి చిట్ ఫండ్ సంస్ధ ద్వారా రామోజీ చట్టవిరుద్ధమైన వ్యాపారం చేస్తోందనేది ఉండవల్లి ఆరోపణ. కేంద్రప్రభుత్వ చట్టాల ప్రకారం రామోజీ వ్యాపారం ఎలా అక్రమమో ఉండవల్లి సంవత్సరాలుగా మొత్తుకుంటున్నారు. ఇదే విషయమై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. రామోజీని ఏ1గా ఆయన కోడలు శైలజను ఏ2గా చీటింగ్ కేసులు నమోదుచేసింది. విచారణ కూడా మొదలుపెట్టింది.





శైలజను 13వ తేదీ అమరావతిలో విచారణకు హాజరుకావాలని సీఐడీ నోటీసులు కూడా జారీచేసింది. విచిత్రం ఏమిటంటే తాను చట్టబద్ధంగానే వ్యాపారం చేస్తున్నట్లు రామోజీ చెప్పలేదు. చిట్ ఫండ్ లో సేకరించే నిధులను చిట్టేతర వ్యాపారాలకు మళ్ళించినట్లు ఆయనే అంగీకరించారని ప్రచారం జరుగుతోంది. ఇక శైలజ అయితే తామసలు చిట్ ఫండ్ చట్టాన్నే ఆమోదించేదిలేదని సీఐడీ విచారణలో చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. మార్గదర్శి వ్యాపారంలో చట్టాల ఉల్లంఘనలకు ఆధారాలను సేకరించామని  సీఐడీ  చెబుతోంది. మనీ ల్యాండరింగ్ వ్యవహారాలు నడుస్తున్నట్లు సీఐడీ ఐజీ సంజయ్ చెప్పారు. 





సమస్య రామోజీ-సీఐడీ-ఉండవల్లి మధ్య అయితే మిగిలిన వాళ్ళు ఎందుకు గోలచేస్తున్నారో అర్ధంకావటంలేదు. రామోజీని ఉండవల్లి, సీఐడీ వదిలిపెట్టదని అర్ధమవుతోంది. అధికారికంగా సీఐడీ రామోజీ మెడకు ఉచ్చుబిగుస్తోంది. రామోజీకి వ్యతిరేకంగా  ఉండవల్లి సుప్రింకోర్టులోను, మీడియా సమావేశాల్లోను ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. అంటే రెండువైపులా రామోజీకి మోతెక్కిపోతోందన్నది వాస్తవం. వాస్తవం ఇలాగుంటే కేసుతో ఎలాంటి సంబంధంలేని వాళ్ళు రామోజీకి మద్దతుగా ఎంతమంది మాట్లాడితే మాత్రం ఏమిటి ఉపయోగం ?  



మరింత సమాచారం తెలుసుకోండి: