రాబోయే ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి కీలకమైన సమావేశం నిర్వహించబోతున్నారు. 24వ తేదీన క్యాంపు కార్యాలయంలో ఎస్సీలతో ప్రత్యేకంగా భేటీ అవబోతున్నారు. ఎస్సీ మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, ఎంపీలతో పాటు పార్టీలోని సీనియర్ నేతలతో సమావేశం నిర్వహిస్తున్నారు. వచ్చేఎన్నికల్లో ఎస్సీ ఓట్లను గంపగుత్తగా వైసీపీకే పడేందుకు అవసరమైన ప్రణాళికలను జగన్ రెడీ చేయబోతున్నారు. అందుకనే ఎస్సీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమై అందరి అభిప్రాయాలను తెలుసుకోవాలని జగన్ డిసైడ్ అయ్యారు.





ఆమధ్య బీసీల నేతలతో ప్రత్యేక సమావేశం జరిపిన  తర్వాత సర్పంచ్ నుండి మంత్రుల వరకు బీసీలతో ప్రత్యేకమైన సదస్సు నిర్వహించారు. అప్పట్లో జరిపిన సదస్సు గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఆ సదస్సుకు సుమారు 60 వేలమంది దాకా బీసీ నేతలు హాజరయ్యారు. వైసీపీ తరపున అన్నివేలమంది బీసీల నేతలున్నారన్న విషయం జనాలందరికీ అప్పుడే తెలిసిందే. అదే పద్దతిలో తొందరలోనే ఎస్సీ ప్రజా ప్రతినిధులతో కూడా ప్రత్యేక సదస్సు ఏర్పాటుచేయాలన్నది జగన్ ఆలోచన. ఇపుడు ఎస్సీల 27 నియోజకవర్గాల్లో వైసీపీ చేతిలోనే 26 ఉన్నాయి.





ఎస్సీల ఓట్లకోసం ఒకవైపు చంద్రబాబునాయుడు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అధికారంలోకి వస్తే ఎస్సీలకు పెద్ద పీట వేస్తుందని పదేపదే చెబుతున్నారు. అధికారంలో ఉన్నపుడు ఏమిచేశారంటే మళ్ళీ సమాధానం చెప్పరు. సరే చంద్రబాబు వ్యవహారం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది కాబట్టి కొత్తగా మాట్లాడుకునేదేమీ ఉండదు. అయితే కోనసీమ జిల్లా ఏర్పాటు సమయంలో జరిగిన గొడవలు అందరికీ గుర్తుండే ఉంటుంది.





ఆ సందర్భంగా ఎస్సీ-బీసీ+కాపుల మధ్య పెద్ద గొడవలే జరిగాయి. అప్పటినుండి కోనసీమ జిల్లాలోని ఎస్సీల్లో ఓ వర్గం వైసీపీకి వ్యతిరేకంగా తయారైందని ప్రచారం మొదలైంది. వ్యతిరేకమైన వర్గం జనసేనకు దగ్గరైందట.  ఒకవేళ ప్రచారం నిజమే అయితే తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని వెంటనే సర్దుబాటు చేసుకోవాలన్నది జగన్ ఆలోచన. దూరమైన వర్గాన్ని మళ్ళీ దగ్గరకు చేసుకోవటం+ మిగిలిపోయిన అరాకొరా ఎక్కడన్నా ఉంటే వాళ్ళని కూడా వైసీపీకి మద్దతుగా మార్చుకోవటమే జగన్ టార్గెట్ గా పెట్టుకున్నారట. అందుకనే ఈ విషయాలు చర్చించేందుకే 24వ తేదీన సమావేశం పెట్టుకున్నారు. మరారోజు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: