గండికోట రిజర్వాయర్ పరిధిలోని ప్రజలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్..వృద్ధులు, చంటి పిల్లలు, చివరికి గర్భిణీలు సైతం వరద నీటిలో చిక్కుకున్నారన్నారు. రిజర్వాయర్లోకి నీటి విడుదలపై సంయమనం పాటించాలన్నారు. నిర్వాసితులను బలవంతంగా కాకుండా వారు ఇష్టపూర్వకంగా వెళ్లే విధంగా అన్నీ రకాల చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.