గత కొంతకాలంగా ఏపీ గవర్నమెంట్ అధికార పార్టీకి జాతీయ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి పొంతన కుదరట్లేదు. గతంలో కూడా హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈసీ కి సహకరించడం లేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆరోపించారు. ఇక ఇండియా హెరాల్డ్ అందిస్తున్న వివరాల్లోకి వెళితే ... రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు ప్రతిపాదిత ఎన్నికలపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల అభిప్రాయాలను వెలికితీసేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బుధవారం సమావేశమైన సమావేశాన్ని అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది.