బిహార్ ఎన్నికల ప్రచార సభలో సీఎం నితీశ్ కుమార్కు చేదు అనుభవం ఎదురైంది. ముఖ్యమంత్రిపై అసహనం వ్యక్తం చేస్తూ ఓ వ్యక్తి స్టేజీ వైపు రాళ్లు, ఉల్లిగడ్డలను విసిరాడు. ఫెయిల్యూర్ సీఎం అంటూ బిగ్గరగా అరిచాడు. నితీశ్ హయాంలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని ఆరోపించాడు. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది..