ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్న దొంగతనాలు. గుంటూరు నగరంలో ఈజీమనీకి అలవాటుపడిన ఏడుగురు ఓ ముఠాగా ఏర్పడ్డారు. బస్టాండ్ వద్ద మాటువేసి దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులను ఆటోలో ఎక్కించుకుంటారు. మధ్యలో మరికొందరు ప్రయాణికుల మాదిరిగా ఆటో ఎక్కి కూర్చుంటారు. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ప్రయాణికులను బెదిరించి నిలువుదోపిడీ చేస్తారు..నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.లక్షా ఇరవై ఐదు వేల నగదు, ఆటోని స్వాధీనం పోలీసులు చేసుకున్నారు.