ట్విట్టర్ కు భారీ షాక్ ఇచ్చిన కేంద్రం.. లేహ్‌ను కేంద్రపాలిత ప్రాంతమైన లఢఖ్‌లో చూపడానికి బదులుగా కశ్మీర్లో చూపడంపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.. అయితే అలా తప్పుగా ఎందుకు చూపించాలన్న విషయాన్ని ఐదు రోజుల్లో చెప్పాలని లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలని కోరారు. ఈ నోటీసులపై ఒకవేళ ట్విటర్ స్పందించకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయని అధికారులు తెలిపారు. సమాధానం ఇవ్వక పోయిన, లేక సంతృప్తికరమైన సమాధానం చెప్పకపోయినా ఐటీ చట్టం ప్రకారం దేశంలో ట్విటర్‌ను బ్లాక్ చేయడం లేదా కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఆరు నెలల జైలు శిక్ష తప్పదని కేంద్రం హెచ్చరించింది..