ఏపి ప్రజలకు గుడ్ న్యూస్.. గడిచిన 24 గంటల్లో 79,823 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,657 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకినవారి సంఖ్య 8,52,955కి చేరింది.. మరణాల సంఖ్యను చూస్తే అందరికి షాక్ ఇచ్చేలా నమోదు అయ్యాయి.. గడిచిన 24 గంటల్లో గడిచిన 24 గంటల్లో కరోనా వైరస్ బారిన పడి ఏడుగురు మృతిచెందారు. కృష్ణా జిల్లాలో ఇద్దరు, అనంతపురంలో ఒకరు, చిత్తూరులో ఒకరు, తూర్పు గోదావరిలో ఒకరు, గుంటూరులో ఒకరు, కర్నూలులో ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 6,854కు చేరింది..