నేరాలకు కేరాఫ్ గా మారుతున్న హైదరాబాద్.. కలకలం రేపుతున్న డెడ్ బాడీ..హైదరాబాద్‌లోని నారాయణగూడలో పట్టపగలు దారుణం జరిగింది. మెట్రోస్టేషన్ దగ్గర ఓ గుర్తుతెలియని వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. అతని తలపై బండరాయితో మోదీ హత్య చేసినట్లుగా తెలుస్తోంది. స్టేషన్ కిందే ఫుట్‌పాత్‌పై వ్యక్తి హత్యకు గురవడం చూసి స్థానికులు, మెట్రో సిబ్బందికి చెప్పారు. మెట్రో సిబ్బంది స్పందించి, మృతదేహాన్ని చూసి బయటపడ్డారు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు..