మెదక్ ఎస్పీ పోలీస్ వర్సెస్ సిద్దిపేట పోలీసు కమిషనరేట్ మధ్య 20-20 ఓవర్ల క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఇరు జట్ల మధ్య జరుగుతున్న ఈ మ్యాచ్కు ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు..  , సచిన్ లెక్క బ్యాటింగ్ బౌలింగ్ లో రెచ్చిపోయాడు. మంత్రి బ్యాటింగ్ శైలిని చూసి చుట్టూ ఉన్నవారు ముచ్చట పడ్డారు. ఆ తర్వాత మంత్రి హరీశ్ రావు మరో ఓవర్ బౌలింగ్ చేయగా పోలీసు కమిషనర్ జోయల్ డేవిస్ బ్యాటింగ్ చేశారు. ఇలా మంత్రి, పోలీస్ కమిషనర్ క్రికెట్ ఆడడం అనేది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది..