తెలంగాణ లో పెరుగుతున్న ప్రేమ జంటల ఆత్మ హత్యలు..జగిత్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ప్రేమ జంట ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. జగిత్యాల రూరల్ మండలం హైదర్ పల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రేమ జంట ఓ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రేమికులిద్దరూ ఆత్మహత్యకు పాల్పడి పదిరోజులు అయ్యిందంటున్నారు పోలీసులు...