కంపెనీలో పనిచేసే పీఏ తో బాస్ అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నాడు.. తీరా ఆమెకి పెళ్లి సంబంధం కుదిరిందని తెలియడంతో తట్టుకోలేక పోయాడు. ప్రియురాలు దూరమైపోతుందన్న కోపంతో ఆమె తల్లి, కాబోయే భర్తతో గొడవపడ్డాడు. చివరికి ప్రాణాలు కోల్పోయాడు. నాలుగు రోజులుగా తన భర్త కనిపించడం లేదంటూ యజమాని భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దారుణం వెలుగుచూసింది.ఈ దారుణ ఘటన ఢిల్లీలో వెలుగులోకి వచ్చింది..