యాదాద్రి భువనగిరిలో వెలుగు చూసిన అమానుషం.. అన్నం పెట్టడానికి వెళ్ళిన కన్న కూతురి పై కన్నేసిన తండ్రి.. కూతురు ప్రతి ఘటించడంతో ఈ విషయం ఎవరికైనా చెబితే ఇంట్లో నుంచి వెళ్లగొడతానంటూ బెదిరింపులకు దిగాడు. భయాందోళనకు గురైన బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో తండ్రి దుర్మార్గం వెలుగులోకి వచ్చింది. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు