పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తర 24 పరగణాస్ జిల్లాలకు చెందిన శివ్దాస్ బెనర్జీ అనే వ్యక్తికి కరోనా సోకడంతో నవంబర్ 4న బలరాంపూర్ బసు హాస్పిటల్లో చేర్పించారు. నవంబర్ 13న హాస్పిటల్ సిబ్బంది బెనర్జీ కుటుంబసభ్యులకు ఫోన్ చేసి ఆయన చనిపోయినట్లు తెలిపారు. అంత్యక్రియలు చేసిన వారం రోజులకు ఆసుపత్రి నుంచి ఒక ఫోన్ వచ్చింది. అతను ఇంకా బ్రతికే ఉన్నారని చెప్పుకొచ్చారు.శివదాస్ బెనర్జీ కరోనాతో హాస్పిటల్లో చేరిన రోజే మోహినిమోహన్ ముఖర్జీ అనే మరో వ్యక్తి కరోనా సోకడంతో అదే హాస్పిటల్లో చేర్పించారు.ముఖర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఆయణ్ని బరాసత్లోని మరో కేంద్రానికి తరలించారు. ఇక్కడే హాస్పిటల్ సిబ్బంది పొరపాటు చేశారు.ఆ ఘటన ఇరు కుటుంబాల ఆగ్రహానికి కారణమయ్యారు..