హైదరాబాద్ లో గ్రేటర్ ఎన్నికల ప్రభావం జోరుగా సాగుతుంది.. ఈ మేరకు రాజేంద్ర నగర్, సికింద్రాబాద్, మాదాపూర్ లతోపాటుగా పలు ప్రాంతాల్లో ఉన్న హోటళ్లకు భారీగా బిరియాని ఆర్డర్లు వచ్చి పడుతున్నాయి.. 150 డివిజన్లలో ప్రచారం చేసేందుకు హైదరాబాద్ కు ఇతర జిల్లాల నుంచి కూడా పలు పార్టీల నాయకులు వచ్చారు. దాదాపు 5 వేల మంది నాయకులు, వారి అనుచరులు హోటళ్లలోనే ఉంటున్నారు. హోటళ్లలో సీటింగ్ సామర్థ్యం కూడా 75 శాతానికి పెరిగిందని హోటల్ మేనేజ్మెంట్ చెబుతున్నారు.