తెలంగాణలో జోరుగా సాగుతున్న గ్రేటర్ ఎన్నికల ప్రచారం.. తెలంగాణ తెలుగు దేశం పార్టీ తరపున చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, బాలకృష్ణ వంటి వారు మాత్రం ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదు. సాధారణంగా తెలుగు రాష్ట్రాలు విడిపోయాక జరిగిన అన్ని ప్రధాన ఎన్నికల్లోనూ చంద్రబాబు టీడీపీ తరపున హైదరాబాద్లో ప్రచారం నిర్వహించేవారు.. కానీ ఇప్పుడు ప్రచారంలో వీరి ఎంట్రీ కనిపించలేదు.. బాబు మౌనం ఎందుకో తెలియడం లేదు..