నగరంలోని భారతీనగర్ డివిజన్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. తెరాస అధికారంలోకి వచ్చాక ఇంటింటికీ నల్లా పెట్టి తాగునీరు అందిస్తున్నామన్నారు. ఇప్పుడు నల్లా బిల్లులు కూడా రద్దు చేస్తున్నట్లు చెప్పారు. కరోనా వల్ల రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం ఆలస్యమైందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇళ్లు లేని పేదలకు త్వరలోనే రెండు పడకగదుల ఇళ్లను అందిస్తామని ఈ సందర్బంగా ఆయన తెలిపారు.