ఎన్నికల విషయంలో ఎక్కడా అల్లర్లు జరగకుండా ఉండాలని పోలీసు శాఖ కూడా అనేక చర్యలను తీసుకుంటున్నారు. సమస్యాత్మక ప్రాంతాలలో అయితే కట్టుదిడ్డమైన చర్యలను తీసుకుంటున్నారు..తాజాగా సీపీ మహేష్ భగవత్ మీడియా తో మాట్లాడారు.. ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో భద్రతా చర్యలను ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. సులేమాన్ నగర్, అత్తాపూర్, రామ చంద్రాపురం మొదలగు సున్నితమైన సమస్యాత్మక ప్రాంతాల్లో ఇప్పటికే సీసీ కెమెరాలతో నిఘాను ముమ్మరం చేశారు..ఎన్నికల నేపధ్యంలో 48 గంటల పాటు మద్యం దుకాణాలు మూసివేయాలని సీపీ నోటిఫికేషన్ను జారీ చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టే విధంగా ఎవరైనా ప్రయత్నించినా, ప్రలోభపెట్టి నా 100 లేదా రాచకొండ వాట్సాప్ 9490617111కు సమాచారం అందజేయాలని విజ్ఞప్తి చేశారు.