భారతీనగర్ లో బీజేపీ మహిళా కార్యకర్తలపై తెరాస దాడి..టీఆర్ఎస్ కార్యకర్తలు మాపై అకారణంగా దాడి చేశారని 111వ డివిజన్ భారతీనగర్ బీజేపీ మహిళా కార్యకర్తలు ఎంఐజీలోని రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు.ప్రచారం చేయొద్దని టీఆర్ఎస్ కార్యకర్తలు బెదిరిస్తున్నారన్నారని ఇది ఎక్కడి న్యాయమని బీజేపీ నేతలు టీఆర్ఎస్ నాయకుల వైఖరీని ఖండించారు. బీజేపీ మహిళా కార్యకర్తల పై దౌర్జన్యం చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.