రాష్ట్రంలో భారీగా వర్షాలు పడుతున్నాయి..ఆంధ్రప్రదేశ్ కి భారీ ప్రమాదం వుంది. ప్రస్తుతం తీవ్రంగా వున్న నివర్ తుఫాన్ బీభత్సం నుంచి తేరుకోక మునుపే మరోసారి వాయుగుండం, తుఫాన్ల ముప్పు పొంచి ఉంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడిందని వాతావరణం శాఖ నుంచి సమాచారం అందింది. నివర్ తీవ్ర అల్పపీడనంగా బలహీనపడి దక్షిణ కోస్తాంధ్ర-పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతోంది.