మత మార్పిడి చేసి పెళ్ళిళ్ళు చేసుకోవడం చట్ట రీత్యా నేరం..మత మార్పిడుల వ్యతిరేక బిల్లు 2020’పేరుతో యూపీ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ ఆమోదం తెలిపారు. ఈరోజు అన్నీ పరిశీలించిన గవర్నర్ సంతకం చేశారు. దీంతో ఈరోజు నుంచే ఇది అమలులోకి వస్తుంది. బలవంతపు మత మార్పిడికి పాల్పడే వారికి గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించనున్నారు.