కేసీఆర్ సర్కార్ పై మండిపడుతున్న నగర వాసులు.. నగరంలోని ఓ ముసలవ్వ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏకిపారేసింది. తమ బస్తీలో ఉన్న సమస్యలను ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్నికలప్పుడు మాత్రం ఓట్లు వేయమని అడగడానికి వస్తారని, తర్వాత తమ సమస్యలను ఎవరూ పట్టించుకోరని మండిపడింది. డ్రైనేజీ, నీటి సమస్య ఉందని.. మాటలు చెబుతారేతప్ప పనులు చేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. డబుల్ బెడ్ రూం ఇల్లు ఇస్తామన్నారు.. ఇంతవరకు ఇవ్వలేదని, ఈసారి టీఆర్ఎస్కు ఓటు వేసేదిలేదని ఆ ముసలవ్వ స్పష్టం చేశారు..