రాజేంద్ర నగర్,భారతీనగర్, రామచంద్రాపురం, పటాన్చెరు డివిజన్లలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో బీజేపీ నాయకులు అడ్డదారులు తొక్కుతున్నారు. హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలు దెబ్బతీసి ఇక్కడికి వచ్చే పెట్టుబడులు గుజరాత్, ముంబైకి తరలించుకుపోవాలని బీజేపీ నేతలు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారన్నారని మంత్రి హరీష్ రావు ఆరోపించారు.