వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే..ఈ రోజు నిరసనలో భాగంగా భారత్ బంద్ ను ప్రకటించారు. ఈ మేరకు కేంద్రం దిగొచ్చింది..నిరసనలు కొనసాగిస్తున్న రైతుల్ని కేంద్ర హోంమంత్రి అమిత్షా చర్చలకు పిలిచారు.. మంగళవారం సాయంత్రం 7గంటలకు రైతులు చర్చలకు రావాలని అమిత్షా తమను ఆహ్వానించారని.. రైతు సంఘాల నాయకుడు రాకేశ్ టికైట్ తాజాగా వెల్లడించారు..మంత్రి అమిత్ షా తమను ఫోన్ కాల్ ద్వారా సంప్రదించినట్లు రాకేశ్ చెప్పారు.