నిజామాబాద్ జిల్లాకు చెందిన నాగమల్ల సంపత్ నగరంలో ఖిలీల్ వాడీలో సౌమ్య కిరాణా అండ్ జనరల్ స్టోర్స్ నిర్వహిస్తున్నాడు.సంపత్ తన బ్యాంక్, కిరాణా షాపు లావాదేవీలను నిర్వహించడానికి గూగుల్ పే బిజినెస్ యాప్ను వినియోగిస్తున్నాడు. రోజువారి తన లావాదేవీలను ఆ యాప్ ద్వారానే చేపడుతున్నాడు. సోమవారం కూడా ఓ లావాదేవీని చేసిన సంపత్కు స్క్రాచ్ కార్డు వచ్చింది. అందులో ఏముందో చూడగా.. రూ. లక్ష రూపాయలు రివార్డు వచ్చినట్టు కనిపించింది. ఆ విషయాన్ని కుటుంబ సభ్యులతో చెప్పి సంబరాలు చేసుకున్నాడు. అంతేకాదు హైదరాబాద్ గూగుల్ పే టీమ్ అతనికి సన్మానం చేయనున్నట్లు తెలుస్తోంది.