ఆంధ్రప్రదేశ్ లో  కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గురువారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గత 24 గంటల్లో 64,354 శాంపిల్స్ పరీక్షించగా మరో 538 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 8,73,995కు చేరింది. గడచిన 24 గంటల్లో ఇద్దరు చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 7047కి చేరింది. గత 24 గంటల్లో 558మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 8,61,711కు చేరింది. మరో 5237మంది హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారని పేర్కొంది.