తూర్పు మధ్యధరా సముద్రంలో ఉన్న సైప్రస్ అనే ద్వీపంలో ఫమగుస్టా అనే ప్రాంతం ఉంది..ఆ ప్రాంతం చుట్టూ నీటితో ఉంటుంది. చూడటానికి చాలా రమణీయంగా,అందంగా ఉంటుంది. ఒక వైపు సాగర తీరం , మరో వైపు ఎంతైనా భవనాలు ఉన్నాయి.విశాలమైన రోడ్లు.. సకల వసతులు ఆ ప్రాంతం సొంతం. కానీ అది ఒకప్పుడు. గత కొన్ని దశాబ్దాలుగా ఆ ప్రాంతం నిర్మానుషంగా ఉంటోంది... అందుకు కారణం రెండు దేశాల మధ్య ఘర్షణలు..ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని తెరిచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నారు..